Share News

Teacher Recruitment: ఉపాధ్యాయుల భర్తీకి సన్నద్ధం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:55 PM

DSC roster points released మెగా డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో రోస్టర్‌ రిజర్వేషన్ల పాయింట్లను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలకు చెందిన సబ్జెక్టులు, సామాజిక వర్గాలవారీగా కేటాయించిన పోస్టుల వివరాలను వెల్లడించింది.

Teacher Recruitment:  ఉపాధ్యాయుల భర్తీకి సన్నద్ధం

  • మెరిట్‌ ఆధారంగా ఎంపికకు కసరత్తు ప్రారంభం

  • డీఎస్సీ రోస్టర్‌ పాయింట్లు విడుదల

  • నరసన్నపేట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో రోస్టర్‌ రిజర్వేషన్ల పాయింట్లను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలలకు చెందిన సబ్జెక్టులు, సామాజిక వర్గాలవారీగా కేటాయించిన పోస్టుల వివరాలను వెల్లడించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్స్‌ ఆమోదం పొందడంతో ఆ వర్గాన్ని గ్రూప్‌ 2, 3గా విభజించి పాయింట్లు కేటాయించింది. జిల్లాలో మొత్తం భర్తీ చేయనున్న పోస్టులు 543. ఇందులో 407 పోస్టులు జిల్లా, మండల పరిషత్‌లో ఉన్నాయి. 51 పోస్టులు పురపాలకసంఘ పరిధిలో ఉండగా, 85 పోస్టులు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు కేటాయించారు. జిల్లాపరిషత్‌, మండల, పురపాలక సంఘం పరిధిలోని 458 పోస్టులకు సామాజిక వర్గాలవారీగా రిజర్వేషన్లు కల్పించారు. వీటిలో 184 జనరల్‌ విభాగం కాగా, బీసీ ఏ- 35, బీసీ బీ- 41, బీసీ సీ- 6, బీసీ డీ -32, బీసీ ఈ -20, ఎస్సీ గ్రూప్‌ 1 - 6 పోస్టులు, ఎస్సీ గ్రూప్‌ 2 - 27, ఎస్సీ గ్రూప్‌ 3 - 36, ఎస్టీకి -25, ఈడబ్ల్యూఎస్‌కు -44 పోస్టులు కేటాయించారు.

  • రోస్టర్‌ రిజర్వేషన్లు ఇలా..

  • స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిషులో 65 పోస్టులకుగాను ఓసీ-26 , బీసీ ఏ- 3, బీసీ బి- 7, బీసీ సి- 1 బీసీ డి- 5, బీసీ ఈ -3 కేటాయించారు. ఎస్సీ గ్రూప్‌ -1లో 1 గ్రూప్‌- 2లో -3 , గ్రూప్‌ -3లో 6, ఎస్టీ -4, ఈడబ్ల్యూఎస్‌కు - 6 కేటాయించారు.

  • హిందీ విభాగంలో 11 పోస్టులకు ఓసీ- 3, బీసీ ఏ, బీ, డీ, ఈ గ్రూప్‌లతోపాటు ఎస్సీ గ్రూపు 2, 3కి ఒక్కోటి, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌కు ఒక్కో పోస్టు కేటాయించారు.

  • తెలుగు విభాగంలో 37 పోస్టులకు ఓసీ -14, బీసీ ఏ - 3, బీసీ బీ- 2, బీసీ డీ - 3, బీసీఈ - 2, ఎస్సీ గ్రూప్‌ 1 -1, గ్రూప్‌ 2,3 కి రెండు చొప్పున, ఎస్టీ-2, ఈడబ్ల్యూఎస్‌ -3 పోస్టులు కేటాయించారు. ఒరియాలో 03 పోస్టులకు ఓసీ -2, బీసీ ఏ - 1 కేటాయించారు.

  • బయాలజీ విభాగంలో 34 పోస్టులకు ఓసీ- 15, బీసీ ఏ, బీకి మూడేసి చొప్పున, బీసీ డీ -2, బీసీ ఈ -1, ఎస్సీ గ్రూప్‌ 1- 1, గ్రూప్‌ 2- 2, గ్రూప్‌ 3- 2, ఎస్టీ - 2, ఈడబ్ల్యూఎస్‌ - 3 కేటాయించారు.

  • గణితంలో 33పోస్టులకుగాను ఓసీ-13, బీసీ ఏ,సీ,ఈ ఒక్కోటి చొప్పున, బీసీ బీ -3, బీసీ డీ- 2, ఎస్సీ గ్రూప్‌ 1, 2కి ఒక్కోటి, గ్రూప్‌ 3కి -4, ఎస్టీ -1, ఈడబ్ల్యూఎస్‌ -3 కేటాయించారు. ఓరియా గణితంలో ఎస్సీ గ్రూప్‌ 2, ఈడబ్ల్యూఎస్‌కు ఒక్కోటి చొప్పున కేటాయించారు.

  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 81 పోస్టులకు గాను ఓసీ - 34, బీసీ ఏ, బీకి ఏడు చొప్పున, బీసీ సీ- 1, బీసీ డీ - 5, బీసీ ఈ -3, ఎస్సీ గ్రూప్‌ 1- 1, గ్రూప్‌ 2- 6, గ్రూపు 3 - 5, ఎస్టీ -5, ఈడబ్ల్యూఎస్‌ - 7 కేటాయించారు.

  • ఫిజిక్స్‌లో 14 పోస్టులకుగాను ఓసీ-4, బీసీ -ఏ, బీ, ఈకి ఒక్కోటి చొప్పున, బీసీ డీ-2, ఎస్సీ గ్రూప్‌ 2- 1, ఎస్సీ గ్రూప్‌ 3- 2, ఈడబ్ల్యూఎస్‌ - 2 కేటాయించారు.

  • సోషల్‌ విభాగంలో 70 పోస్టులకు ఓసీ-28, బీసీ ఏ -5, బీసీ బీ -6, బీసీ సీ -1, బీసీ డీ -4, బీసీ ఈ -3, ఎస్సీ గ్రూప్‌ 1 -2, ఎస్సీ గ్రూప్‌ 2 -4, గ్రూప్‌ 3 -5 , ఎస్టీ -3 , ఈడబ్ల్యూఎస్‌ -06 కేటాయించారు. ఒరియా మీడియంలో బీసీ ఏ,డీ,ఈకి ఒక్కో పోస్టు కేటాయించారు.

  • ఎస్జీటీలో 113 పోస్టులకుగాను ఓపెన్‌ -38, బీసీ ఏ,బీకి 8 చొప్పున, బీసీ సీ -2, బీసీ డీ- 6, బీసీ ఈ- 4, ఎస్సీ గ్రూప్‌ 1- 1, ఎస్సీ గ్రూప్‌ 2- 5, ఎస్సీ గ్రూప్‌ 3 - 8, ఎస్టీ -5, ఈడబ్ల్యూఎస్‌ -10 కేటాయించారు. ఒరియా మీడియంలో ఓపెన్‌ -7, బీసీ ఏ -1, బీసీ బీ -3, బీసీ డీ -1, ఎస్సీ గ్రూప్‌ 2, 3కి ఒక్కోటి, ఎస్టీ -2, ఈడబ్ల్యూఎస్‌కు -2 పోస్టులు కేటాయించారు.

Updated Date - Aug 24 , 2025 | 11:55 PM