అస్వస్థతకు గురై గర్భిణి మృతి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:28 PM
అర్జునాపురం గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి (26) అనే గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతి చెందింది.
కంచిలి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అర్జునాపురం గ్రామానికి చెందిన కాయ ధనలక్ష్మి (26) అనే గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ధనలక్ష్మికి ఏడాది కిందట ఇచ్ఛాపురం మండలం మండపల్లికి చెందిన కాయ శివతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. కాగా కన్నవారింట్లో ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉంటోంది. సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా ఆమె అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే సోంపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో రెండు ఆసుపత్రులకు వెళ్లి అక్కడి నుంచి సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ధనలక్ష్మి మృతి చెందినట్లు వైద్యుడు మూల జోగినాయుడు తెలిపారు. ఈ ఘటనపై సోంపేట ఎస్‌ఐ లవరాజు (ఇన్‌చార్జి ఎస్‌ఐ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.