Share News

సమస్యల పరిష్కారానికి ‘ప్రజాదర్బార్‌’

ABN , Publish Date - May 08 , 2025 | 11:41 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజాదర్బార్‌’ నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

సమస్యల పరిష్కారానికి ‘ప్రజాదర్బార్‌’
ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం, మే 8(ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రానికి ‘ప్రజాదర్బార్‌’ నిర్వహిస్తు న్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. పాతపట్నంలో గురువారం ఎమ్మె ల్యే మామిడి గోవింద రావు ఆధ్వ ర్యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రతి సమస్య సత్వర పరిష్కరించ నున్నామన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలనుంచి ప్రజలు తరలివచ్చి పింఛ న్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు కేటాయిం చాలని కోరారు. దీంతో ఆయన వెంటనే సంబంధిత ఎంపీడీవోలతో మాట్లాడి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే గిరిజన గూడ ల్లో తాగునీటి ఇబ్బం దులున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆయన దృషి ్టకి తీసుకు వెళ్లగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మాటా ్లడి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనం తరం నీలమణిదుర్గ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలను సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా బైక్‌ర్యాలీ చేపట్టారు. గజమాలతో వారిని అభిమానులు సత్కరించారు. అనంతరం పీఎల్‌పురం పంచాయతీ పీటీ రోడ్డు నుంచి ద్వారకాపురం రోడ్‌ వరకు ప్రధానమంత్రి జన్‌మన్‌ నిధులు రూ.63 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డ్వామా పీడీ బి.సుధాకర్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:41 PM