సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్: ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:50 PM
:ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
నరసన్నపేట, జూన్ 26(ఆంధ్రజ్యోతి):ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం నరసన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నది చెంత ఉన్నా సాగునీటి ఏటా ఇబ్బంది పడుతున్నామని లుకలాం రైతులు విన్నవించారు. ఓపెన్‌హెడ్ చానళ్లను ఆధునికీకరించాలని రైతులు కోరారు. నాలుగు మండలాలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ
పోలాకి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):మబగాంలో గొర్రెలకు నట్టల నివారణా మందుల పంపిణీని గురువారం ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి పద్మప్రియ మాట్లాడుతూ నెలరోజుల పాటు ఉచితంగా గొర్రెలకు వ్యాఽధులు సోకకుండా నట్టల నివారణా మందులు వేస్తామన్నారు.