Share News

రావివలసలో పీఆర్‌ అధికారుల పర్యటన

ABN , Publish Date - May 23 , 2025 | 11:59 PM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురువారం రావి వలస గ్రామస్థులతో ‘మన ఊరు-మాటా మంతి’లో రూ.15 కోట్లతో వివిధ అభివృద్ధికి పనులకు హామీ ఇవ్వడంతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ ఆదేశాల మేరకు పంచా యతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల బృందం గురువారం రావివలస, దామోదరపురం, నారాయణపురం గ్రామాలను సందర్శించారు.

రావివలసలో పీఆర్‌ అధికారుల పర్యటన
చిన్న నారాయణపురంలో కల్వర్టును పరిశీలిస్తున్న పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు

టెక్కలి, మే 23(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురువారం రావి వలస గ్రామస్థులతో ‘మన ఊరు-మాటా మంతి’లో రూ.15 కోట్లతో వివిధ అభివృద్ధికి పనులకు హామీ ఇవ్వడంతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ ఆదేశాల మేరకు పంచా యతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల బృందం గురువారం రావివలస, దామోదరపురం, నారాయణపురం గ్రామాలను సందర్శించారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ జి.రవికుమార్‌, ఈఈ రౌతు సూర్యప్రకాష్‌, డీఈఈ ఎం. సుధాకర్‌, మండల ఇంజనీర్‌ లక్ష్మునాయుడు తదితరు లు క్షేత్రస్థాయిలో పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించారు. ఎండల మల్లికార్జునస్వామి ఆలయానికి రాక పోకల మార్గాల విస్తరణ, చిన్ననారాయణ పురం, దామోదరపురం, రావివలస గ్రామాల్లో సీసీ రోడ్లు, కాలువలు, శ్మశాన వాటికలకు రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, అప్రో చ్‌ రోడ్లు, కల్వర్టులు ఇలా.. సుమారు రూ.12 కోట్లతో పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులన కలెక్టర్‌ ఆమోదించిన తరువాత యుద్ధప్రాతిపదికన చేపట్ట నున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీ ఎల్‌ఎల్‌ నాయుడు, మాజీ సర్పంచ్‌ బడే జగదీష్‌, యా దవ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఇప్పిలి జగదీష్‌, అనపాన జనార్దన రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ జి.రవికుమార్‌ ఎండల మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.

Updated Date - May 23 , 2025 | 11:59 PM