పొట్టి శ్రీరాములు త్యాగం.. స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:08 AM
Potti Sriramulu's death anniversary తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం.. అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
- మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం.. అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళి అర్పించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘మహాత్మగాంధీ సిద్ధాంతాల ప్రభావంతో స్వాతంత్య్ర సంగ్రామం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న ధీరోదాత్తుడు.. పొట్టి శ్రీరాములు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసి అమరజీవిగా నిలిచారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా మార్చడమే మన సంకల్పమ’ని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, పలువురు నాయకులు ఉన్నారు.