ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించాలి: కలెక్టర్
ABN , Publish Date - May 31 , 2025 | 12:13 AM
యోగాంధ్ర-2025, పీ ఎం సూర్యఘర్ ప్రభు త్వ కార్యక్రమా లపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 30(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర-2025, పీ ఎం సూర్యఘర్ ప్రభు త్వ కార్యక్రమా లపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందిం చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. శుక్రవారం ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారు లతో వివిధ కార్యక్రమాల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో యోగాంధ్ర-2025 కార్య క్రమాలు గ్రామస్థాయి నుంచి చురుగ్గా జరుగుతున్నాయన్నారు. పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జేసీ పర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, సీపీవో లక్ష్మీప్రసన్న, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కృష్ణమూర్తి, డీఎంహెచ్‌వో అనిత, డీఈవో తిరుమల చైతన్య, ఆయుష్ కోఆర్డినేటర్ పి.జగదీ ష్, జిల్లా పర్యాటకాధికారి ఎన్.నారాయణరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.