Share News

హమాలీల అర్ధనగ్న ప్రదర్శన

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:56 PM

ఎచ్చెర్ల బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న బాట్లింగ్‌ యూనిట్‌ను విడదీద వద్దని కోరుతూ హమాలీలు గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

హమాలీల అర్ధనగ్న ప్రదర్శన
అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న హమాలీలు

ఎచ్చెర్ల, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న బాట్లింగ్‌ యూనిట్‌ను విడదీద వద్దని కోరుతూ హమాలీలు గురువారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వర రావు మాట్లాడుతూ.. ఈ యూనిట్‌ను విడదీసి టెక్కలిలో అద్దె భవనంలో ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తుందో తెలియజేయాలన్నారు. టెక్కలి డిపో ఏర్పాటు ఉత్త ర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు. గతంలో దళితుల వద్ద భూములు తీసుకుని బాట్లింగ్‌ కంపెనీ పెట్టారని, అప్పటి నుంచి ఏళ్ల తరబడి ఇదే పనిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న దళితుల పొట్ట కొట్టవద్దన్నారు. కార్య క్రమంలో హమాలీల యూనియన్‌ నాయకులు డి.బంగార్రాజు, టి.రామా రావు, నిడిగింట్ల రమణ, జి.శ్రీనివాసరావు, లండ సీతారాం, లింగాల రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:57 PM