జార్ఖండ్‌కు చెందిన పోర్టు కార్మికుడి మృతి
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:59 PM
మూలపేట పోర్టులో పనిచేస్తు న్న జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు పక్లూ పింగ్వా(36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు నౌపడ ఎస్.ఐ.నారాయణస్వామి తెలిపారు.
సంతబొమ్మాళి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టులో పనిచేస్తు న్న జార్ఖండ్‌కు చెందిన కార్మికుడు పక్లూ పింగ్వా(36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు నౌపడ ఎస్.ఐ.నారాయణస్వామి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌కు చెందిన పింగ్వా రెండు వారాల కిందట మూలపేట పోర్టులో లేబర్ పనికోసం వచ్చి లేబర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. పోర్టుమార్టం కోసం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.