‘పెంట’లో పారిశుధ్య నిర్వహణ అధ్వానం
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:52 PM
గ్రామంలో పారిశుధ్య నిర్వ హణ ఇలాగే ఉంటుందా అని డీపీఆర్‌సీ రిసోర్స్‌పర్సన్‌లు కె.రాజేష్, మోహదీన్‌ఖాన్ పంచాయతీ అధికారులను ప్రశ్నించారు.
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో బయటపడిన వైనం
జి.సిగడాం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): గ్రామంలో పారిశుధ్య నిర్వ హణ ఇలాగే ఉంటుందా అని డీపీఆర్‌సీ రిసోర్స్‌పర్సన్‌లు కె.రాజేష్, మోహదీన్‌ఖాన్ పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. పెంట గ్రామం లో పారిశుధ్య నిర్వహణ, చెత్త సంపద కేంద్రాలపై నిర్లక్ష్యం తదితర అంశాలపై ఐవీఆర్‌ఎస్ కాల్స్‌లో బయటపడడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో డీపీవో ఆదేశాల మేరకు గురువారం పెంట గ్రామాన్ని డీపీఆర్‌సీ బృందం గురువారం సందర్శించింది. గ్రామ ప్రవే శంలో మడ్డువలస కుడి ప్రధాన కాలువ వద్ద చెత్తపోగులతో అపరిశుభ్ర వాతావరణం ఉండడంపై అసం తృప్తి వ్యక్తంచేశారు. అలాగే ఎస్సీ కాలనీలో కాలువల్లో చెత్త పేరుకు పోవడం, చెత్తసంపద కేంద్రాన్ని విని యోగించకపోవడాన్ని పరిశీలించారు. చెత్తను తగులబెడుతుండడన్ని గమనించి ఇదేనా చెత్త సంపద కేంద్రం నిర్వహణ అని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. చెత్తను సేకరించి ఎరువులను తయారుచేసి అవసరమైన రైతులకు తక్కువ ధరకు అందించాలనే ప్రభుత్వ ఆశయా నికి అధికారులు తూట్లు పొడుస్తున్నారన్నారు. గ్రామంలో స్థానికుల నుంచి నుంచి చెత్త సేకరణపై ఆరా తీశారు. నివేదికను జిల్లా అధికారు లకు అందించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి. రామకృష్ణారావు, పంచాయతీ కార్యదర్శులు ఎ.దుర్గారావు, సురేష్, గ్రామ స్థులు మక్క శ్రీనివాసరావు, అక్కలనాయుడు తదితరులు పాల్గొన్నారు.