దీపావళికి దూరంగా ‘పొందూరుపుట్టుగ’
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:29 PM
ఆ గ్రామానికి చెందిన వ్యక్తిలకు ప్రమాదం జరిగిందని తెలిసి గ్రామస్థులంతా దీపావళి పండుగను చేపట్టలేదు.
కవిటి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఆ గ్రామానికి చెందిన వ్యక్తిలకు ప్రమాదం జరిగిందని తెలిసి గ్రామస్థులంతా దీపావళి పండుగను చేపట్టలేదు. తోటి వ్యక్తి ప్రమాదంలో ఉంటే తామంతా ఎలా ఆనందంగా ఉంటామని భావించి అందరూ ఏకగ్రీవంగా దీపావళిని చేపట్టకుండా మానవత్వం చాటుకున్న ఘటన పొందూరు పుట్టుగలో జరిగింది. గ్రామానికి చెందిన డి.రామమూర్తి, కుమారుడు ప్రణయ్ కుమార్ వారం కిందట కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స కోసం లక్షల్లో నగదు అవసరమవుతోంది. గ్రామస్థులంతా వారికి సహకారం అందిస్తున్నారు. ఈ సమ యంలో దీపావళి పర్వదినం సోమవారం రావడంతో గ్రామస్థులంతా సందడి చేయ కూడదనే నిర్ణయా నికి వచ్చారు. గ్రామంలో ఉన్న 50 ఇళ్లల్లోను వెలుగులు లేకుండా తోటి గ్రామ స్థునికి సంఘీ భావంగా నిలిచారు.