Share News

సక్రమంగా పోలియో చుక్కలు వేయాలి

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:19 AM

జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ సక్రమంగా పోలి యో చుక్కలు వేయించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

సక్రమంగా పోలియో చుక్కలు వేయాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ సక్రమంగా పోలి యో చుక్కలు వేయించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థాని క ఎన్టీఆర్‌ భవనంలో శనివారం ఇందుకు సంబం ధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడా రు. ఈనెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే పల్స్‌పోలియో కార్యక్రమం జి ల్లాలో శతశాతం విజయవం తం చేయాలన్నారు కార్యక్రమం లో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, టీడీపీ నాయకులు బోయిన రమేష్‌, తర్ర రామకృష్ణ, కర్రి అప్పారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:19 AM