పోలీస్ శిక్షణ కేంద్రం పరిశీలన
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:28 PM
ఇటీవల ఎంపికైన స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ (ఎస్‌సీటీపీసీ) త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలసలో జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు.
శ్రీకాకుళం రూరల్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎంపికైన స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ (ఎస్‌సీటీపీసీ) త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలసలో జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. శిక్షణ కేంద్రంలోని మైదానం, తరగతి గదులు, కంప్యూటర్ ట్యాబ్, బ్యారెక్స్, తాగునీటి సరఫరా, మెస్, భోజనశాల, స్నానాల గదులను పరిశీలిం చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోలీ స్ కానిస్టేబుల్ శిక్షణ త్వరలో ప్రారంభంకానున్నందున మౌలిక వసతుల ను మెరుగుపరచాలన్నారు. శిక్షణకు అవసరమయ్యే అన్ని వసతులు సిద్ధం చేయాలని సంబంధిత అధి కారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాస రావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు పైడిపు నాయుడు, ఇమ్మా న్యుల్‌రాజు, ఈశ్వరరావు, అవతారం, కృష్ణమూర్తి, ఆర్‌ఐ లు, రూరల్ ఎస్‌ఐ కె.రాము తదితరులు పాల్గొన్నారు.