ఎల్.ఎన్.పేటలో పోలీసు అవుట్ పోస్టు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:03 AM
ఎల్. ఎన్.పేటలో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసేం దుకు శాఖాపరంగా చర్యలు చేపట్టినట్లు ఆమదాలవలస సీఐ పి. సత్యనారాయణ తెలిపారు.
ఎల్.ఎన్.పేట,జూలై 31(ఆంధ్రజ్యోతి): ఎల్. ఎన్.పేటలో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసేం దుకు శాఖాపరంగా చర్యలు చేపట్టినట్లు ఆమదాలవలస సీఐ పి. సత్యనారాయణ తెలిపారు.ఈ మేరకు అవుట్‌పోస్టు కార్యాల యం ఏర్పాటుకు మండల పరిషత్ నుంచి తీర్మానం తీసుకున్నట్లు చెప్పారు.గురువారం ఎల్.ఎన్.పేటలోని మండల పరి షత్ కార్యాలయానికి ఆనుకుని ఉన్నదక్షిణవైపు సగం నిర్మాణంలో నిలిచిపో యిన స్ర్తీశక్తి భవనం సీఐ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట రెండు మండలాలకు సరుబుజ్జిలిపోలీసుస్టేషన్ నుంచే పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. మండ లానికి ఒకపోలీసుస్టేషన్ ఉండాలన్న నిబంధనల్లోభాగంగా పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటుకు పరిశీలించినట్లు చెప్పారు.ఎల్.ఎన్.పేట మండలం పరిధిలో గల గ్రామాల్లో గొడవలు, తగాదాలు జరిగే సమయంలో సరుబుజ్జిలి పోలీసు స్టేషన్‌కు రావలసివస్తోందని తెలిపారు.దీంతో ప్రజల ఇబ్బందులదృష్ట్యా అవుట్ పోస్ట్(పోలీసు)స్టేషన్ ఏర్పాటుచేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు శాఖాపరంగా తగిన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కాగాస్ర్తీశక్తి భవనం నిలిచిపోయిన పనులు వేగవంతంగా చేయాలని కాంట్రాక్టరుకు కోరిన ట్లు తెలిపారు. ఆయనతోపాటు సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి ఉన్నారు.