Share News

వరుస దొంగతనాలు.. ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:04 AM

టెక్కలి పరిధిలో ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగత నాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల కు సంబంధించిన వ్యక్తిని శనివారం అరెస్టు చేశా రు.

వరుస దొంగతనాలు.. ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ విజయ్‌కుమార్‌

  1. నాలుగు చోరీ కేసుల్లో వ్యక్తి అరెస్టు

  2. 78 గ్రాముల బంగారం, 38 గ్రాముల వెండి, నగదు స్వాధీనం

టెక్కలి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): టెక్కలి పరిధిలో ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగత నాల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల కు సంబంధించిన వ్యక్తిని శనివారం అరెస్టు చేశా రు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ విజ య్‌కుమార్‌ తన కార్యాలయంలో వెల్లడించారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న బెనియా జగబందు అలియాస్‌ పోతురాజును స్థానిక నౌప డా-మెళియాపుట్టి రోడ్డు ఫ్లైఓవర్‌ కింద పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఇతడి నుంచి 78.205 గ్రా ముల బంగారు ఆభరణా లు, 38 గ్రాముల వెండి ఆ భరణాలు, రూ.10వేలు న గదు స్వాధీనం చేసుకున్నా రు. టెక్కలి పరిధిలో ఇటీ వల జరిగిన నాలుగు చోరీ కేసుల్లో బెనియా జగబం దు నిందితుడిగా ఉన్నాడు. గతంలో కూడా జగబందు అనేక కేసుల్లో అరెస్టయ్యా డు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా.. న్యాయా ధికారి రిమాండ్‌ విధించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Dec 07 , 2025 | 12:04 AM