అనారోగ్యంతో పోలీసు జాగిలం టినా మృతి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:56 PM
:జిల్లా పోలీసు శాఖలో ఏడేళ్ల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం టినా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవా రం సాయంత్రం మృతిచెం దింది.
ఎచ్చెర్ల, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):జిల్లా పోలీసు శాఖలో ఏడేళ్ల పాటు విశేష సేవలందించిన పోలీసు జాగిలం టినా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవా రం సాయంత్రం మృతిచెం దింది. ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ కేవీ రమణ టినా భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డీఎస్పీ శేషాద్రి, ఆర్‌ఐ శంకరప్రసాద్, ఆర్‌ఎస్‌ఐలు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా, టినా లాబ్రడార్ జాతికి చెందినది. 2019లోని విజయవాడలోని మంగళగిరిలో 6వ బెటాలియన్ డాగ్ స్క్వాడ్ శిక్షణ కేంద్రంలో (పేలుడు పదార్ధాలు స్నిఫర్ డాగ్ లేదా డిటెక్షన్ డాగ్) స్నిపర్ డాగ్‌గా శిక్షణ పొందింది.