Share News

ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:10 AM

Sexual assault with the help of the girl's mother రణస్థలం మండలం జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ పిన్నింటి రామా రావుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు
మాట్లాడుతున్న డీఎస్పీ వివేకానంద

బాలిక తల్లి సహకారంతోనే లైంగిక దాడి

నిందితుల అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలం జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ పిన్నింటి రామా రావుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఆటోడ్రైవర్‌కు సదరు బాధిత బాలిక తల్లితో 8 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. తరచూ ఆమె ఇంటికి వెళ్లే క్రమంలో 13ఏళ్ల ఆమె కుమార్తెపై కన్నేశాడు. నిత్యం బాలికపై లైంగికంగా వేధించేవాడు. ఇదంతా తెలిసినా కూడా బాధిత బాలిక తల్లి మద్యానికి బానిసై సదరు ఆటోడ్రైవర్‌ను ప్రోత్సహించిందే తప్ప నిలువరించలేదు. బాలిక పిన్ని, బాబాయ్‌, మేనమామలు జరిగిన విషయాన్ని తెలుసుకొని జేఆర్‌పురం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టి ఆటోడ్రైవర్‌ రామారావును, బాలిక తల్లిని అరెస్టు చేశాం. ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశాం. ఆటోను కూడా సీజ్‌ చేశాం. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించామ’ని డీఎస్పీ తెలిపారు. ‘ప్రధానంగా ఎక్కువ మంది బంధువులు, తెలిసిన వారు, ఆటో డ్రైవర్లే బాలికలపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఆటోల్లో పాఠశాలలకు పంపించినప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఆటోడ్రైవర్ల ప్రవర్తనను పరిశీలిస్తుండాలి. మహిళా పోలీసులు వారంలో నాలుగు రోజులు పాఠశాలలకు వెళ్లి గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలపై ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాకు సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామ’ని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 12:10 AM