పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
ABN , Publish Date - May 14 , 2025 | 12:21 AM
మైనర్ బాలి కలపై జరిగే శారీరక, లైంగిక వేధింపుల నేరాలు అరిక ట్టేందుకు పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
నేరస్థులకు శిక్షపడేలా దర్యాప్తు ఉండాలి
స్కూల్స్, కళాశాలల వద్ద పెట్రోలింగ్ పెంచాలి
ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, మే 13(ఆంధ్రజ్యోతి): మైనర్ బాలి కలపై జరిగే శారీరక, లైంగిక వేధింపుల నేరాలు అరిక ట్టేందుకు పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐలతో ఫోక్సో, క్రైమ్ కేసుల దర్యాప్తు, విచారణ, ప్రస్తుత స్థితి కేసుల్లో సాధించిన పురోగతి తదితర అంశాలపై ఏఎస్పీ కేవీ రమణతో కలిసి సమీక్షించారు. అపరిష్కృతంగా ఉన్న పోక్సో కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, కేసుల్లో పురోగతి సాధించి నేరస్థులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలన్నారు. స్టేషన్ల వారీగా పోక్సో కేసుల దర్యా ప్తులో సాధించిన పురోగతి, సాంకేతిక ఆధారాలు, చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్ కేసుల్లో నిర్ణీత 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేయా లన్నారు. స్కూళ్లు, కాళాశాలల వద్ద శక్తి బృందాలతో పోలీసు పెట్రోలింగ్ పెంచాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు పోక్సో, మహిళా చట్టాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు గోవిందరావు, నేతాజీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు వారి కార్యాలయాల నుంచి పాల్గొన్నారు.