పీఎన్‌డీటీ చట్టం కఠినంగా అమలు చేయాలి
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:57 PM
లింగ నిర్థారణ చట్టాన్ని కఠి నంగా(పీఎన్‌డీటీ) అమలుచేయాలని కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ ఆదేశిం చారు. శనివారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌లో సలహాకమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): లింగ నిర్థారణ చట్టాన్ని కఠి నంగా(పీఎన్‌డీటీ) అమలుచేయాలని కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ ఆదేశిం చారు. శనివారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌లో సలహాకమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష, మూఢ నమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవా పథకం ద్వారా ప్రజలకు సత్వర వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యానికి తావు లేదన్నారు.ప్రభుత్వం ఈ పథకం ఫలితాలను శతశాతం పేదలకు అందే విధం గా అధికారులు కృషిచేయాలన్నారు.ప్రైవేటుఆసుపత్రులు రోగుల నుంచి డబ్బు లు వసూలుచేయరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా 387 కేసుల్లో ప్రజాభిప్రాయం కోరగా 20 కేసుల్లో ప్రైవేటు ఆసుపత్రులు డబ్బులు వసూలు చేశాయని ఫిర్యాదులు అందాయ న్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ కళ్యాణబాబు, డీఐఓ రాందాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీ క్యాథరీన్, ఆర్‌బీఎస్‌కే కోఆర్డినేటర్ వెంకటరావు, డీపీఎంవో బి.రవీంద్ర, ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జీవీ లక్ష్మి, స్వర్ణలత, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ఎన్.ప్రసాదరావు, డిప్యూటీ డీఈఎంవో వేంకటేశ్వరరావు, కిమ్స్ ఆసుపత్రి ఏవో సోమేశ్వరరావు పాల్గొన్నారు.