ఖరీఫ్‌నకు పుష్కలంగా సాగునీరు: ఈఈ
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:18 AM
ఈ ఏడాది ఖరీఫ్‌కు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరందిం చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొట్టాబ్యారేజీ ఈఈ సీతారాం నాయుడు అన్నారు.
హిరమండలం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌కు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరందిం చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొట్టాబ్యారేజీ ఈఈ సీతారాం నాయుడు అన్నారు. శుక్రవారం బ్యారేజిని సందర్శించి నీటి నిల్వ పరి స్థితిని పరిశీలించారు. కుడి,ఎడమ కాలువల నిర్వహణపై డీఈ సర స్వతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జూలై రెండోవారంలో కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగు నీటిని విడిచిపెట్టే అవకాశం ఉందన్నారు. బ్యారేజీ అన్ని గేట్టు మూసి వేసి నిటిని నిల్వచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నీటి మట్టం 37 మీట ర్లకు చేరుకుందన్నారు. కార్యక్రమలో ఏఈ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.