పైపులైన్లు లీకై.. బురద నీరు కలిసి
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:32 PM
మండలంలోని పలు గిరిజనగ్రామాల్లో వర్షాకాలంలోనూ తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. డబార్, సవర మర్రిపాడు, కేరాశింగి,భరణికోట పంచాయతీల్లో రెండు దశాబ్దాల కిందట వేసిన తాగునీటి పైపులైన్లు పూర్తి దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల తరచూలీకవుతున్నాయి.
మెళియాపుట్టి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గిరిజనగ్రామాల్లో వర్షాకాలంలోనూ తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. డబార్, సవర మర్రిపాడు, కేరాశింగి,భరణికోట పంచాయతీల్లో రెండు దశాబ్దాల కిందట వేసిన తాగునీటి పైపులైన్లు పూర్తి దెబ్బతిన్నాయి. దీంతో పలుచోట్ల తరచూలీకవుతున్నాయి.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురద నీరు పైపులైన్లలో చేరడంతో తాగునీరు కలుషితమవుతోందని గిరిజనులు వాపోతున్నారు.ఆయాగ్రామాల్లో నివసిస్తున్నసుమారు వెయ్యి మంది వరకు తాగునీటికి అవస్థలకు గురవుతున్నారు. కుళాయిల ద్వారా బురదనీరు వస్తోందని, ఇవి తాగితే వ్యాధులు బారిన పడే ప్రమాద ముందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సమీపంలోని పంటపొలాల్లోని నేలబావులను తాగునీటికోసం ఆశ్రయిస్తున్నామని పలు వురు చెబుతున్నారు. ఏళ్లకిందట ఏర్పాటుచేసిన పైపులైన్లకు పంచాయతీ అధికారులు మరమ్మతులుచేయడంలేదని విమర్శలొస్తున్నాయి. పైపు లైన్లకు లీకులు అరికట్టి తాగునీరందించాలని పలువురు కోరుతున్నారు.