Share News

పీజీఆర్‌ఎస్‌లో 50 వినతుల స్వీకరణ

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:48 PM

ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ ఎస్‌)లో 50 వినతులు స్వీకరించారు.

పీజీఆర్‌ఎస్‌లో 50 వినతుల స్వీకరణ
సమస్యలు తెలుసుకుంటున్న ఏఎస్పీ శ్రీనివాసరావు

శ్రీకాకుళం క్రైం, అక్టో బరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ ఎస్‌)లో 50 వినతులు స్వీకరించారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమవారం ఏఎస్పీ పి. శ్రీనివాసరావు వివిధ సమ స్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధి లో పరిష్కారం చూపాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఫిర్యా దుదారుల అర్జీలు, వారి వివరాలు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా తెలిపి తక్ష ణం తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదా ర్థాలకు దూరంగా ఉండాలని, వ్యసనాల బారిన పడవద్దని డీఎస్పీ వివేకా నంద అన్నారు. ఏఐవైఎఫ్‌ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సన్‌ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్‌ పొందాలన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మొజ్జాడ యుగంధర్‌, పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా పలు అంశాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సన్‌ విద్యా సంస్థల చైర్మన్‌ జయరాం, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్‌కుమార్‌, కొన్న శ్రీనివాసరావు, నగర కన్వీనర్‌ వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:48 PM