అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జేసీ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:16 AM
గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీలను ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా సత్వరమే పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 193 అర్జీలను స్వీకరించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): గ్రీవెన్స్‌లో వచ్చే అర్జీలను ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా సత్వరమే పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 193 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేతస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో ఎస్‌వీ లక్ష్మణమూర్తి, ప్రత్యేకాధికారి ఎం.వేంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి పాల్గొన్నారు.