Share News

Petitions : అర్జీలకు సత్వర పరిష్కారం చూపాల్సిందే

ABN , Publish Date - May 13 , 2025 | 12:07 AM

Grievance redressal ప్రజా ఫిర్యాదులు, పరిష్కార వేదిక.. ‘మీ-కోసం’ కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Petitions : అర్జీలకు సత్వర పరిష్కారం చూపాల్సిందే
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినక ర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 12(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదులు, పరిష్కార వేదిక.. ‘మీ-కోసం’ కార్యక్రమంలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ-కోసం’ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. వివిధ సమస్యలపై జిల్లా ప్రజల నుంచి 119 అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వానికి తావులేదని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే పీజీఆర్‌ఎస్‌పై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏ, పెండింగ్‌ అర్జీలు, రీ-ఓపెన్‌, ఆడిట్‌ పెండింగ్‌లో ఉన్న వాటిపై సమీక్షించాలని సూచించారు. నేరుగా జిల్లా అధికారులే మాట్లాడి ఎండార్స్‌మెంట్‌ చేసి, అర్జీదారులకు నాణ్యమైన సమాధానం ఇవ్వాలని తెలిపారు.

  • రెవెన్యూ సమస్యలపై సమీక్ష.

  • వివిధ శాఖల వద్ద రెవెన్యూ భూముల సమస్యలపై కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకుని రిపోర్టు తయారు చేయాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, గిరిజన సంక్షేమం, పోలీసు, పంచాయతీరాజ్‌, డీపీఓ, ఏపీఐఐసీ, మున్సిపాలిటీ, జాతీయ రహదారి, రహదారులు భవనాలు, ఏపీఈపీడీసీఎల్‌, ఇరిగేషన్‌, వంశధార, క్రీడలు తదితర శాఖల సమస్యలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:07 AM