రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:42 AM
కొత్తపల్లి జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం, కాశీనగరానికి చెందిన పడాల శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు.
కోటబొమ్మాళి, డిసెంబరు 22(ఆంద్రజ్యోతి): కొత్తపల్లి జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం, కాశీనగరానికి చెందిన పడాల శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీధర్ తన స్వగ్రా మం కాశీనగరం నుంచి కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామంలోని తన బంధువులు ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొత్తపల్లి జంక్షన్‌లో ఆగి.. ఆ గ్రామానికి వెళ్లేందుకు దారి అడుగుతుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొ నడంతో శ్రీధర్ కాలు విరిగిపోయింది. అతడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
బస్సు నుంచి జారిపడి ఒకరికి..
బూర్జ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): లచ్చయ్యపేట కూడలిలో బస్సు ఎక్కే ప్రయత్నంలో ఓ వ్యక్తి జారిపడి గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుం ది. ఉప్పినివలస గ్రామానికి చెందిన గొల్లపల్లి గోవిందరావు పాలకొండ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. కాలికి గాయాలై న గోవిందరావును 108లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.