Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:48 PM

అలుదు గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బురుజువాడ గ్రామానికి చెందిన రావాడ ముకుందరావు (34) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

జలుమూరు (సారవకోట), డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): అలుదు గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బురుజువాడ గ్రామానికి చెందిన రావాడ ముకుందరావు (34) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముకుందరావు బురుజువాడ నుంచి ద్విచక్రవాహనంపై నరసన్నపేట వెళ్తుండగా అలుదు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రగా గాయప డ్డాడు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు. ముకుందరావు సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు.

వాహనం అదుపు తప్పి వ్యక్తికి గాయాలు

శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నగరంలోని కిన్నెర థియేటర్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి తాను నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలి లా ఉన్నాయి.. నగరానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డు ఉద్యోగి వరసాల పాపా రావు ఎచ్చెర్ల మండలం కురమయ్యపేట చర్చిలో పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పాత శ్రీకాకుళం మావూరివీధిలో నివాసం ఉంటున్న పాపారావు బుధవారం రాత్రి తన ఇంటికి బైక్‌పై వస్తుండగా.. కిన్నెర థియేటర్‌ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడడంతో తలకు బలమై న గాయమైంది. స్థానికుల సమాచారం మేరకు పాపారావును 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం అతని బంధువులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అతడి కుమారుడు విజయ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు గురువారం ట్రాఫిక్‌ ఎస్‌ఐ హిమంది శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Dec 18 , 2025 | 11:48 PM