క్రమశిక్షణతో విధులు నిర్వహించండి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:10 AM
క్రమశిక్షణ తో విధులు నిర్వహించి పోలీసు శాఖకు పేరు తీసుకురా వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ తో విధులు నిర్వహించి పోలీసు శాఖకు పేరు తీసుకురా వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పోలీస్ నియామకాల్లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారిని శుక్రవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. హోంగార్డులుగా విధులు నిర్వహిస్తూ కృషి, పట్టు దలతో కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడం అభినందనీయ మన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భం గా కానిస్టేబు ళ్లుగా ఎంపికైన ఎస్.నరేష్, ఎర్రన్న, డి.హట కేశం, జె.వెంకట రమణ, జి.చిన్నారావు, సీహెచ్ సంజీవరావు, వై.తిరుపతిరావులకు శాలువాలు కప్పి అభినందించారు. కార్య క్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో సీహెచ్ గోపీనాథ్, హోంగార్డు ఆర్‌ఎస్‌ఐ ఆర్వీ రమణ తదితరులు పాల్గొన్నారు.