అంకితభావంతో విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:51 PM
అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి అన్నారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి అన్నారు. ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ను బుధవారం సందర్శించిన ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఈ క్యాంపస్‌లో ఎక్కువగా ఉన్న నేపథ్యం లో వారికి సాంకేతిక విద్యను పూర్తిగా అందేలా చర్యలు తీసుకో వాలన్నారు. విద్యార్థులతో స్నేహ పూర్వక వాతావరణంలో మెలగాలన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పరిశీలించారు. కార్యక్ర మంలో క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ, ఏవో ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ అభివృద్ధికి సహకరిస్తా
ఎచ్చెర్ల, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైౖర్మన్ ప్రొఫె సర్ కె.మధుమూర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన వర్సిటీని సందర్శించారు. ఎన్టీ ఆర్ పరిపాలనా భవనం, సైన్స్ కళాశాలను పరిశీలించారు. ఖాళీ స్థలంలో హంపీ థియేట ర్‌ను నిర్మిస్తే మరింత శోభాయమానంగా ఉంటుందన్నారు. ఔషధ మొక్కలు పెంచాల న్నారు. ప్రొఫెసర్ మధుమూర్తిని వీసీ కేఆర్ రజని సత్కరించారు. కార్యక్రమంలో పూర్వపు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.స్వప్నవాహిని, ఎస్‌వో కె. సామ్రాజ్యలక్ష్మి, ఎన్.సంతోష్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.