ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:36 PM
ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం రూరల్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సింగుపురం పీహెచ్‌సీ లో శుక్రవారం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక, ఆరోగ్య ఇబ్బం దులు ఎదుర్కోకుండా అవసరమైన ఆరోగ్య సేవలు పొందేలా చూడడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రధాన ఉద్దేశ మన్నారు. అందుబాటులోని ప్రభుత్వ ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే రోగిపై నిబద్ధతతో వ్యవహరించి వైద్య సేవలు అందించాలని సిబ్బం దికి సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ జి. ఇందిరా ప్రసాద్, వైద్యాధికారి లిల్లీ తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవలు అందరికీ ఒకేలా ఉండాలి
ఆరవ అదనపు జిల్లా న్యాయాధికారి కిశోర్ బాబు
సోంపేట, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందరికీ ఒకేలా ఉండేలా చూడాలని ఆరవ అదనపు జిల్లా న్యాయాధికారి కోడూరు కిశోర్ బాబు కోరారు. యూనివర్సిల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా ఆరోగ్యవరం కంటి ఆసుపత్రిలో శుక్రవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులను ప్రజలు దేవుళ్లుగా నమ్ముతారని, అదేలా వైద్యులు నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెం డెంట్ గ్రేసీ, బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు జీఎస్ శైలీంద్ర, న్యాయవాది కె.రాజేశ్వరరావు తదితరులుపాల్గొన్నారు.