ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:11 AM
: బంగా ళాఖాతంలో అల్పపీడ నం కారణంగా కురు స్తున్న భారీ వర్షాలకు నదీతీర గ్రామాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష సూచించారు. తమ్మి నాయుడుపేట వద్ద నాగావళి నది నీటి ప్రవాహాన్ని సోమవారం పరిశీలించారు.
ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్
ఎచ్చెర్ల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బంగా ళాఖాతంలో అల్పపీడ నం కారణంగా కురు స్తున్న భారీ వర్షాలకు నదీతీర గ్రామాల ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష సూచించారు. తమ్మి నాయుడుపేట వద్ద నాగావళి నది నీటి ప్రవాహాన్ని సోమవారం పరిశీలించారు. నీటి ఉధృతి పెరిగితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. వారితో పాటు తహసీల్దార్ బి.గోపాల్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వావిలపల్లి రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
మత్స్యకారులూ.. వేటకు వెళ్లొద్దు
సోంపేట రూరల్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్ర తీర గ్రామాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, పలాస ఆర్డీవో వెంకటేష్ కోరారు. సోమవారం సాయంత్రం ఉప్పలాం, గొల్లవూరు పంచాయతీ పరిధిలోని నడుమూరు, ఎకువూరు, గొల్లవూరు గ్రామాలను సందర్శించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నడుమూరు హైస్కూల్, గొల్లవూరు తుఫాన్ రక్షిత భవనాలకు ప్రజలను తరలించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సీఐ మంగరాజు, బారువ ఎస్‌ఐ హరిబాబునాయుడు, తహసీల్దార్ బి. అప్పలస్వామి, మత్స్యకార నాయకులు బడే సూరి, బడే ఈశ్వరరావు, ఎం.పాపారావు, దుర్యోధన, రామారావు, మెరైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రెల్లిగెడ్డ బ్రిడ్జి పైనుంచి రాకపోకల నియంత్రణ
పొందూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మూడు రోజు లుగా కురుస్తున్న భారీ వర్షాల కు లైదాం సమీపంలోని రెల్లిగెడ్డ వంతెన వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఎటు వంటి ప్రమాదాలు చోటు చేసు కోకుండా అధికారులు ముంద స్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. ప్రస్తుతం వరదనీరు కొద్దిగా వంతెన పైనుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలను నియంత్రిస్తున్నారు. సోమవారం ఆర్‌ఆండ్‌బీ ఏఈ పీటీ రాజు, ఎస్‌ఐ వి.సత్యనారాయణ బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించారు. పాదచారులు జాగ్రత్తలు తీసుకుని బ్రిడ్జి పైనుంచి తగిన రాకపోకలు సాగించేందుకు అనుమతిస్తున్నారు.
తుఫాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: డ్వామా పీడీ
ఇచ్ఛాపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డ్వామా పీడీ బి.సుధాకరరావు ఆదేశించారు. సోమవారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం లో అన్ని శాఖల అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అధి కారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మత్స్యకార గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అనంతరం డొంకూరు సముద్ర తీరంలో మత్స్యకారు లతో మాట్లాడి అప్రమత్తం చేశారు. ఎంపీడీవో రామారావు, డీటీ శ్రీహరి, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.