పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:39 PM
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే బాఽధ్యత ప్రభుత్వంపై ఉందని రిటైర్డు ఉద్యోగుల సంఘ జేఏసీ చైర్మన్ సీహెచ్ పురుషోత్తంనాయుడు అన్నారు.
అరసవల్లి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే బాఽధ్యత ప్రభుత్వంపై ఉందని రిటైర్డు ఉద్యోగుల సంఘ జేఏసీ చైర్మన్ సీహెచ్ పురుషోత్తంనాయుడు అన్నారు. ఆదివారం పెన్షర్ల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు బకాయి ఉన్న డీఏను తక్షణమే విడుదలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షలు మంది ఈపీఎస్ పెన్షనర్లలో సగం మంది పెన్షన్ వెయ్యిరూపాయిలు లోపే అన్నారు. కనీసం డీఏ రూ.9వేలు ఇవ్వాలని కోరారు. సంఘ నాయకులు బాపయ్యపంతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఓపీఎస్ పింఛన్‌దారులకు నష్టం అని వెంటనే ఉపసంహారించాలని కోరారు. కార్యాక్రమంలో వీఎస్‌ఎస్ కేశవరావు, పి.సుధాకర్, ఎంఆర్ ప్రకాషరావు, కె.సోమసుందరరావు, ఎస్.భాస్కరరావు, కె.చంద్రవేఖర్, ఎం.గోవర్దనరావు, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.