Share News

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 15 , 2025 | 11:34 PM

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూపరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్‌,పంచాయతీరాజ్‌, గ్రామ సచివాలయాల పనితీరుపై జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి మండల,జిల్లాస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూపరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్‌,పంచాయతీరాజ్‌, గ్రామ సచివాలయాల పనితీరుపై జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి మండల,జిల్లాస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిశీలనను ప్రామాణికంగా డివిజన్ల స్థాయిలో పూర్తిచేయాలని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.మునిసిపల్‌ కమిషనర్లు, జిల్లా ప్రణాళికాధికారి, గ్రామీణ నీటిపారుదలఅధికారుల మధ్య సమన్యయం తప్పనిసరిగా ఉండాలన్నారు. పల్లె పండుగ నేపథ్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగాన్ని గ్రామస్థాయి ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్ల వద్దే పర్యవేక్షించాలన్నారు.సూర్యగృహ పథకంలో బ్యాంకులు, కాంట్రాక్లర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమగ్రశిశు అభివృద్ధి కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్‌, తాగునీటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప కలెక్టర్‌ పద్మావతి, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, డీపీవో భారతీ సౌజన్య, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, ఐసీడీఎస్‌ పీడీ శాంతిశ్రీ, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సూర్యకిరణ్‌, ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

జిల్లాలో 857 చలివేంద్రాలు ఏర్పాటు

జిల్లాలో వేసవి త్రీవతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు, ఎండ తీవ్రత నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశాల మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 857 చలి వేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వీటిలో 137 ప్రభుత్వ శాఖల ద్వారా, 693 స్థానిక సంస్థల ద్వారా, 27 స్వచ్ఛంద సంస్థలు, ఇతరుల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. జలుమూరు మండలంలో 40, కంచిలిలో 42, బూర్జ మండలంలో 34 చలివేం ద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటుచేశారు. ఈ మేరకు ప్రతి మం డలానికి మోనటరింగ్‌ అధికారి నియమించడంతో వాటి నిర్వహణను పర్యవే క్షిస్తున్నారు. తాగునీరు, నీటి కూలర్లు, శీతల నీరు ఏర్పాట్లు, నీటి డబ్బాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో పౌరులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, తాగునీటి అందుబా టును ఉంచేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 11:34 PM