Share News

పెండింగ్‌ డీఏలను చెల్లించాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:24 PM

పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. భానుమూర్తి డిమాండ్‌ చేశారు.

పెండింగ్‌ డీఏలను చెల్లించాలి
ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు, ఉపాధ్యాయులు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. భానుమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద సంఘ ప్రతినిధులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్క రించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. 12వ పీఆర్సీని నియమించాలని, ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. అనం తరం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో సంఘం ప్రతి నిధులు మజ్జి మదన్‌మోహన్‌, చావలి శ్రీనివాస రావు, బి.చంద్రశేఖర్‌, ఎస్‌. శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

దసరా కానుకగా ఐఆర్‌ ప్రకటించాలి

రణస్థలం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యా యులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని ఆంధ్ర ప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.బాలాజీ డిమాండ్‌ చేశారు. సభ్యత్వ అభియాన్‌లో భాగంగా మంగళవారం మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. 2023లో వేయాల్సిన 12వ పీఆర్‌సీ కమిటీని ఇంతవరకు నియ మించకపోవడం దారుణమన్నారు. దీనివల్ల రెండేళ్లు పీఆర్సీ కాలాన్ని నష్టపోయారన్నారు. సంఘం జిల్లా పూర్వ అధ్యక్షుడు జి.వెంకటగిరి కాం ప్లెక్స్‌ స్థానాల్లో పనిచేస్తున్న గణిత, ఆంగ్ల ఉపాధ్యాయులకు శాశ్వత స్థానాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు జి.చిన్నికృష్ణంనాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:24 PM