మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారం
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:27 AM
పెండింగ్ కేసు ల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుంద ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం లీగల్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పెండింగ్ కేసు ల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుంద ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 90 రోజుల మీడియేషన్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం మధ్య వర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వ న్యాయవాదులు కక్షిదారులకు అనుకూలంగా వ్యవహ రించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తంగి శివ ప్రసాద్, పిట్టా దామోదర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు పాల్గొన్నారు.