Share News

పెచ్చులూడి.. బీటలు వారి

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:59 PM

కొత్తూరు సీహెచ్‌సీ ఆవరణలో గల ఆయు ర్వేద ఆసుపత్రిశిథిలావస్థకు చేరడంతో ఇక్కడకు వచ్చేరోగులు భయాందోళన చెందుతున్నారు. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనం కనీస మరమ్మ తులకు నోచుకోవడంలేదు. దీంతో ప్రస్తుతం శ్లాబ్‌ నుంచి పెచ్చులూడుతున్నాయి.

 పెచ్చులూడి.. బీటలు వారి
శిథిలావస్థకు చేరిన ఆయుర్వేద ఆసుపత్రి:

కొత్తూరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కొత్తూరు సీహెచ్‌సీ ఆవరణలో గల ఆయు ర్వేద ఆసుపత్రిశిథిలావస్థకు చేరడంతో ఇక్కడకు వచ్చేరోగులు భయాందోళన చెందుతున్నారు. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనం కనీస మరమ్మ తులకు నోచుకోవడంలేదు. దీంతో ప్రస్తుతం శ్లాబ్‌ నుంచి పెచ్చులూడుతున్నాయి. గోడలు బీటలు వారడంతో ఏ క్షణం కూలిపోతుందోనని భయాందోళనతో రోగులు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తిచూపడం లేదు.దీనికితోడు ఆసుపత్రి ఆవరణ అధ్వా నంగా ఉండడంతో రోగులు ఇబ్బందిపడుతున్నారు. ఈ భవనంలో పక్కనఉన్న ఐటీసీకేంద్రం భవనం దుస్థితి కూడా అధ్వానంగా ఉండడంతో రోగులు ఈ రెండు కేంద్రాలకు వేళ్లేందుకు ఆశక్తి చూపడం లేదు. ఉన్నతాదికారులు స్పందించి ఇతర గదుల్లోకి ఆయుర్వేద ఆసుత్రి మార్చాలలని రోగులు కోరుతున్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:59 PM