Share News

ధార్మిక జీవనంతోనే శాంతి

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:40 PM

ధార్మిక జీవ నమే శాంతికి మూలమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వ రరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ‘భగవద్గీత ప్రయోజనం’ అనే అంశంపై మాట్లాడారు. ‘మనిషి సుఖశాంతులతో జీవించాలంటే మనసును ఆధీనంలో ఉంచుకోవాలి.

ధార్మిక జీవనంతోనే శాంతి
చాగంటి దంపతులకు జ్ఞాపికను అందజేస్తున్న ఈవో ప్రసాద్‌:

శ్రీకాకుళం లీగల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ధార్మిక జీవ నమే శాంతికి మూలమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వ రరావు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ‘భగవద్గీత ప్రయోజనం’ అనే అంశంపై మాట్లాడారు. ‘మనిషి సుఖశాంతులతో జీవించాలంటే మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. ధార్మిక జీవనం అంటే ధర్మబద్ధంగా జీవించడమే. పూజలు చేసినంత మాత్రాన ధార్మిక జీవనం కాజాలదు. ఎదుటి వారి హితం కోరి జీవించడమే ధార్మిక జీవితం. ధర్మబద్ధంగా జీవించని భక్తుల కానుకలను కూడా భగవంతుడు స్వీకరించడు’ అని వివరించారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ రచించిన శ్రీవేంకటేశ్వర మహత్యం గురించి వివరించారు.

ఫఅరసవల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనా రాయణ స్వామి వారిని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, సుబ్ర హ్మణ్యేశ్వరి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలికారు. సూర్య నమస్కారాల పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ వారికి ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

Updated Date - Dec 23 , 2025 | 11:40 PM