నివగాంలో పీడీఎస్ బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:13 AM
నివగాంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి దాడి చేసి పట్టుకున్నట్టు సివిల్ సప్లయిస్ డీటీ సీహెచ్ భీమారావు తెలిపారు.
కొత్తూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నివగాంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి దాడి చేసి పట్టుకున్నట్టు సివిల్ సప్లయిస్ డీటీ సీహెచ్ భీమారావు తెలిపారు. స్థానిక సత్యనారాయణ రైసు మిల్లు వద్ద అక్రమంగా బియ్యం నిల్వ ఉన్న ట్లు సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేశారు. సుమారు 21 టన్నుల అక్రమ బియ్యం పట్టుకున్నారు. వీటితో పాటు బొలేరో వాహనంలో తరలింపునకు సిద్ధంగా ఉన్న బియ్యం కూడా పట్టుకున్నట్టు తెలిపారు. రైసుమిల్లు యజమాని ఇప్పిలి గోవిందరావు, వ్యాపారులు గండిమి రవి, సవర విజయ, సవర కామేష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో సీఎస్‌డీటీ సూర్యప్రకాశ్, వీఆర్వోలు నారాయణరావు, రాజగోపాల రావులు పాల్గొన్నారు.