Share News

శ్యాంపిస్టన్స్‌ కార్మికుల వేతనాలు చెల్లించండి

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:07 AM

శ్యాంపిస్టన్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు మార్చి నెల వేతనాలను వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సీటూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

శ్యాంపిస్టన్స్‌ కార్మికుల వేతనాలు చెల్లించండి
: ధర్నా చేస్తున్న కార్మికులు

రణస్థలం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): శ్యాంపిస్టన్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు మార్చి నెల వేతనాలను వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సీటూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వరిసాం వద్ద గల శ్యాంపిస్టన్స్‌ పరిశ్రమ గేటు ఎదురుగా శుక్రవారం సీటూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలవంతపు రిటైర్మెంట్లు నిలుపుదల చేయాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.అప్పలనర్సయ్య, జి.కిరణ్‌, ఆర్‌.ఎస్‌.నాయుడు, కె.భోగేష్‌, ఎన్‌.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:07 AM