పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:07 AM
పన్నులను సకాలంలో చెల్లించి ఆమదాలవలస పట్టణా భివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పన్నులను సకాలంలో చెల్లించి ఆమదాలవలస పట్టణా భివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. బుధవారం స్థానిక ముని సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మునిసిపాలి టీకి రావాల్సిన పన్నులను చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం మునిసిపల్ ప్రాంతాల్లో స్థల క్రమబద్ధీక రణకు వెసులుబాటు కల్పించిందని, దీనిని వినియో గించుకోవాలన్నారు. గతంలో రోడ్ల ప్లాన్ అప్రూవల్‌కు కష్టతరంగా ఉండేదని, ప్రస్తుతం పది అడుగుల రహ దారి కూడా ప్లాన్ అప్రూవల్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు మునిసిపల్‌శాఖ నిబంధనలతో అనుమతులు పొందాలన్నారు. అను మతులు లేకుండా వేసిన లేఅవుట్లలో నిర్మాణాలు చేప డితే మునిసిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతులు, సేవలు ఉండవని స్పష్టం చేశారు. కార్య క్రమంలో కమిషనర్ టీవీ రవి, పీఏసీఎస్ అధ్యక్షురాలు సిమ్మ మాధవి, నారాయణ పురం ఆనకట్ట చైర్మన్ సనపల ఢిల్లీశ్వర రావు, ఎంపీటీసీ అన్నెపు భాస్కర రావు, పీవీకే రాజు పాల్గొన్నారు.