Share News

వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:16 AM

పేస్కేల్‌ అమలు చేయాలని, నైట్‌ డ్యూటీలు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏలు ధర్నా చేపట్టారు.

వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలి
నిరసన తెలుపుతున్న వీఆర్‌ఏలు

శ్రీకాకుళం, కలెక్టరేట్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): పేస్కేల్‌ అమలు చేయాలని, నైట్‌ డ్యూటీలు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ వద్ద వీఆర్‌ఏలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘ గౌరవాధ్యక్షుడు అల్లు సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 19,500 మంది వీఆర్‌ఏలు ఉన్నా రని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదన్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి టి.త్రినాథరావు, రమణమూర్తి మాట్లాడుతూ.. పార్ట్‌ టైం పే రుతో ఫుల్‌ టైం సేవలను చేయించుకుంటున్నారని, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తించకపోవడం అన్యాయమన్నారు. తొలుత డచ్‌ బంగ్లా వద్ద సమావేశమై, అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్క ర్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:17 AM