Share News

Development path: పవన్‌ మాట.. అభివృద్ధి బాట

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:42 PM

Devalopment works at ravivalasa డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హామీలు నెరవేరనున్నాయి. ఎండలమల్లన్న కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. రావివలస గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Development path: పవన్‌ మాట.. అభివృద్ధి బాట
ఎండల మల్లికార్జునస్వామి ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులు

  • నెరవేరనున్న డిప్యూటీ సీఎం హామీలు

  • రావివలసలో రూ.15కోట్లతో శరవేగంగా పనులు

  • టెక్కలి రూరల్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హామీలు నెరవేరనున్నాయి. ఎండలమల్లన్న కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. రావివలస గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు కోరిక మేరకు ఈ ఏడాది మే 22న టెక్కలిలో ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శ్రీకారం చుట్టారు. టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి.. తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్రజల అభ్యర్థన మేరకు రావివలసలో వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.15కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. ఎండల మల్లన్న ఆలయ అభివృద్ధితోపాటు పంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కరించనున్నారు. రహదారులు, కాలువల వ్యవస్థ మెరగుపరచనున్నారు. పెద్ద చెరువు అభివృద్ధి, దోబీఘాట్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. వైసీపీ పాలనలో ఆలయాలను అభివృద్ధి చేయకుండా వదిలేశారు. దేవదాయశాఖ నిధులు సైతం దారి మళ్లించారు. ఈ క్రమంలో రావివలసలోని ఎండలమల్లన్న ఆలయంలో కూడా కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఎండలమల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రావివలసకు మంచిరోజులు వచ్చాయని గ్రామస్థులు సంబరపడుతున్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:42 PM