సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:49 PM
సమాజ సేవలో విద్యార్థులు ముందుండాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం రూరల్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవలో విద్యార్థులు ముందుండాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నైర వ్యవసాయ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో బైరివానిపేటలో జరుగుతున్న సేవా శిబిరం ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఎన్‌ఎస్ శిబిరాలు విద్యార్థుల్లో సేవాభావం పెంపొందిస్తుందన్నారు. గ్రామాల్లో వివిధ అంశాలపై అవగాహన కలిగించడం అభినందనీయమన్నారు. నైర కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు వ్యవసాయం, ఆధునిక సాంకేతిక, లాభదాయక పంటల పై అవగాహన కలిగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధికారి డా.ఎం. సుధాకర్, డా.జి.జోగినాయుడు, పీజీ మూర్తి నరేష్, ప్రతాప్, డా. కె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.