Share News

అమ్మవారి సంబరాల్లో పాల్గొని..

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:11 AM

జమేదారు పుట్టుగ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

అమ్మవారి సంబరాల్లో పాల్గొని..

తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం

ఇచ్ఛాపురానికి చెందిన యువకుడి మృతి

కవిటి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): జమేదారు పుట్టుగ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇచ్చాపురం పట్టణం లోని ఉప్పల వీధికి చెందిన చెందిన గేదెల నాగ రాజు(32) బంధువుల పిలుపుమేరకు ఆదివారం కంచిలిలో జరుగుతున్న కంచమ్మతల్లి సంబరాల్లో పాల్గొన్నాడు. సాయంత్రం వరకు ఉత్సవాలను తిలకించిన తర్వాత తన ఇంటికి చేరుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ క్రమం లో జమేదారుపుట్టుగ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయా లు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ వి.రవి వర్మ తెలిపారు. కాగా నాగరాజుకి భార్య దివ్య, రెండేళ్ల కుమారుడు ఉన్నా రు. ప్రస్తుతం భార్య గర్భవతి. ఇదిలావుంటే గతంలో నాగరాజు తల్లిదండ్రు లతోపాటు సోదరుడు కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

Updated Date - Jun 10 , 2025 | 12:12 AM