పాఠశాల విలీనంపై తల్లిదండ్రుల నిరసన
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:02 AM
:మండలంలోని భగవాన్‌దాస్‌పేట ప్రభుత్వ పాఠశాలను నరసాపురం ఆదర్శప్రాఽథమిక పాఠశాలలో విలీనంచేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పొందూరు ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
పొందూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి):మండలంలోని భగవాన్‌దాస్‌పేట ప్రభుత్వ పాఠశాలను నరసాపురం ఆదర్శప్రాఽథమిక పాఠశాలలో విలీనంచేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పొందూరు ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భగవాన్‌దాస్ పేట ఎంపీపీ పాఠశాలను నరసాపురం ఆదర్శప్రాఽథమిక పాఠశాలలో విలీనం చేసేందుకు అధికారులు పంపించిన ప్రతిపాదనలపై పునరాలోచించాలని కోరారు. పిల్లలు నరసాపురం పాఠశాలకు భారీ వాహనాలతో రద్దీగా ఉండే రాష్ట్ర రహదారి దాటా ల్సిఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. లైదాం ఎంపీయూపీ పాఠశాల స్థాయిని తగ్గించి మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్పుచేయడంపైనా లైదాం పాఠశాల విద్యా ర్ధుల తల్లిదండ్రులు కూడా నిరసన తెలిపారు. అనంతరం ఎంఈవోకు భగవాన్ దాస్‌పేట, లైదాం పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు వినతిపత్రం అందజేశారు.