రద్దీ ప్రాంతాల్లో పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే..
ABN , Publish Date - May 25 , 2025 | 11:25 PM
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జాతర సమయాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్ట వద్దని, వారి బాధ్యత తల్లిదండ్రులే వహించాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బీకేఆర్ పట్నాయక్ అన్నారు.
పలాస, మే 25(ఆంధ్రజ్యోతి): బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జాతర సమయాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పిల్లలను ఎట్టి పరిస్థితు ల్లోనూ విడిచి పెట్ట వద్దని, వారి బాధ్యత తల్లిదండ్రులే వహించాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బీకేఆర్ పట్నా యక్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆది వారం న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల విషయంలో తల్లిదం డ్రులు జాగ్రత్తలు పాటించాలని, వెట్టి చాకిరీ కోసం ఇతర దేశాలకు పిల్లలను అమ్ముకునే వారున్నారని, వారిపై అప్రమత్తంగా ఉండాల న్నారు. అటు వంటి వారు తారసపడితే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు అప్పగించా లని, లేకుంటే బాలల సంరక్షణ కేంద్రాలు, 100, 1098లకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏజీపీ పిండి వెంకటరావు, జాయింట్ సెక్రటరీ జీఎంఎస్ అనిల్‌రాజు, న్యాయవాదులు లోకేశ్వరరావు, దేవరాజు, అసిస్టెంట్ డిపో మేనేజర్ సంతోష్‌కుమార్, బాబూరావు, సునీల్‌కుమార్, తిరుపతిరావు పాల్గొన్నారు.