సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:57 PM
కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షే మం ప్రజలకు సమాంతరంగా అందించడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టెక్కలి, డిసెంబరు 13(ఆం ధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షే మం ప్రజలకు సమాంతరంగా అందించడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలిలో కోటి 35లక్షల రూ పాయలతో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం చేశా రు. అలాగే రూ.60లక్షల అంచ నా వ్యయంతో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠ శాల క్రీడా మైదానం, రూ.20లక్షల అంచనా వ్య యంతో వంటశాల, అదనపు మరుగుదొడ్లు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.12లక్ష లతో సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అంతకుముందు పట్టుమహాదేవి కోనేరు, అన్నాక్యాంటీన్, వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పనులను మంత్రి పరి శీలించారు. అలాగే పలువురు విద్యార్థులతో అచ్చె న్నాయుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువు తోనే ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, కూటమి నాయకులు పిన కాన అజయ్‌కుమార్, ఎల్‌ఎల్ నాయుడు, హను మంతు రామకృష్ణ, లవకుమార్, కామేసు, మామి డి రాము, దమయంతి, సుందరమ్మ, ప్రసాద్‌రెడ్డి, గండి సూర్యనారాయణరెడ్డి, దోని బుజ్జి, సర్పంచ్ గొండేల సుజాత, బీజేపీ నాయకులు ఉన్నారు.
నందిగాం మండలంలో మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షించాలని దిమిలాడ, తెంబూరు పీఏసీఎస్ అధ్యక్షులు పినకాన అజయ్‌కుమార్, పోలాకి చంద్రశేఖరరావు మంత్రికి విన్నవించారు. టెక్కలి లో నూతన కోర్టు సముదాయ భవనాలు మం జూరు చేయాలని న్యాయవాదులు వివిధ సమస్యలపై మరికొంతమంది మంత్రికి విన్నవించు కున్నారు. అలాగే జిల్లాపరిషత్ బాలికోన్నత పా ఠశాల ప్లస్‌లో పదో తరగతి చదువుతున్న వూన్న ఉమాశ్రీ మంత్రి అచ్చెన్నాయుడు చిత్రాన్ని వేసి ఆయనకు బహూకరించారు.
గత వైసీపీ పాలనలో టెక్కలిలో చాలాచోట్ల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం జరిగాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శని వారం రాత్రి సబ్‌కలెక్టర్ కార్యాలయ నూతన స మావేశ మందిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రికార్డులు మార్చికొన్ని ఆస్తు లు, రెవెన్యూ రికార్డులు చింపికొన్ని ఆస్తులు దోచుకున్నారన్నారు. టెక్కలిలో గత ప్రభుత్వ అండదండలతో ఆక్రమించుకున్నవన్నీ బయటకు తీస్తామని స్పష్టం చేశారు.