ఉమారుద్ర కోటేశ్వరాలయ చైర్మన్‌గా ‘పాండ్రంకి’
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:55 PM
బలరామ ప్రతిష్ఠితమైన నగరం లోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్‌గా పాండ్రంకి దేవేంద్ర నాయుడు నియమితులయ్యారు.
అరసవల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): బలరామ ప్రతిష్ఠితమైన నగరం లోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్‌గా పాండ్రంకి దేవేంద్ర నాయుడు నియమితులయ్యారు. ఈ మేరక బుధ వారం దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా కోరాడ రమేష్, కఠారి కమల, సాలిహుండాం శ్రీదేవి నియమితుల య్యా రు. దేవేంద్ర నాయుడు 2000-2002 మధ్య కాలంలో ఇదే ఆల యానికి చైర్మన్‌గా వ్యవహరించారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే గొండు శంకర్‌ను బుధవారం దేవేంద్రనాయుడు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బూర్లె రమణమ్మ, ఎంవీఆర్ మూర్తి, తంగి సూర్యారావు ఉన్నారు.