Share News

'Palle Nidra' సమస్యలు తెలుసుకునేందుకే ‘పల్లెనిద్ర’: ఎమ్మెల్యే ఎంజీఆర్‌

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:00 AM

'Palle Nidra' సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం చేపడు తున్నా మని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

'Palle Nidra'  సమస్యలు తెలుసుకునేందుకే ‘పల్లెనిద్ర’: ఎమ్మెల్యే ఎంజీఆర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం చేపడు తున్నా మని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శనివారం రాత్రి సుర్జని గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకే వెళ్లి సమ స్యలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశిం చారన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఉద్దానం ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ తాగునీరివ్వడం జరు గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌ పండా, టీడీపీ నాయకులు లోతుగడ్డ తులసీ వర ప్రసాద్‌, సలాన మోహనరావు ఎంపీటీపీ సుజాత తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పంపిణీపై నిఘా పెంచండి: ఎమ్మెల్యే బగ్గు

నరసన్నపేట, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీపై నిఘా పెంచాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. శనివారం కత్తిరి వానిపేటలోని క్యాంపు కార్యాల యంలో సివిల్‌ సప్లై శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరుకులు లబ్ధిదారులకు సక్ర మంగా అందుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించాలన్నారు. ఎండీయూ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వ్యవ హరిస్తున్నారని, ఈనెల లో రేషన్‌ బియ్యం పలువురు లబ్ధిదారులకు అందలేదని తన దృష్టికి వచ్చిందన్నా రు. దీనిపై డీఎస్‌వో సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నెలలో బియ్యాన్ని డీలర్ల వద్ద ఉన్న పాత నిల్వల మేరకు ఎలాట్‌ చేశామన్నారు. తూనికల్లో తేడా వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:00 AM