Share News

పలాస రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:05 AM

పలాస రైల్వేస్టేషన్‌ను అమృతభారత్‌ రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆధునీకరిస్తున్నారు. ఒకటో నెంబరు ప్లాట్‌ఫారాన్ని టిక్కెట్‌ రిజర్వేషన్‌ కార్యాలయం ఉండే ప్రాంతానికి మార్చేపనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్లాట్‌ఫారాలను కలుపుతూ పది మీటర్ల వెడల్పుతో భారీ ఫుట్‌బ్రిడ్జిని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

పలాస రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ
మూడో నెంబరు ప్లాట్‌ఫారం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి పూర్తయిన పునాది పనులు:

పలాస, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):పలాస రైల్వేస్టేషన్‌ను అమృతభారత్‌ రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆధునీకరిస్తున్నారు. ఒకటో నెంబరు ప్లాట్‌ఫారాన్ని టిక్కెట్‌ రిజర్వేషన్‌ కార్యాలయం ఉండే ప్రాంతానికి మార్చేపనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్లాట్‌ఫారాలను కలుపుతూ పది మీటర్ల వెడల్పుతో భారీ ఫుట్‌బ్రిడ్జిని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండేళ్ల కిందట పలాస రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించేందుకు రూ.24.50 కోట్లు కేంద్ర రైల్వేశాఖ మంజూరు చేసిన విషయం విదితమే. దీంతో పాటుగా అదనంగా మరో 15 కోట్లు జోనల్‌వర్క్స్‌కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఫ్లాట్‌ఫారాన్ని మార్పిడి చేస్తు కొత్తగా దీన్నికిలోమీటరు పొడవునా నిర్మిస్తున్నారు. కాశీబుగ్గ ఎల్‌సీ గేటు నుంచి తాళభద్ర ఎల్‌సీ గేటుకు సమీపం వరకూ ప్లాట్‌ఫ్లారం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత పనులు 20 శాతం మేరకుజరిగాయి. బ్రిడ్జి పనులుకూడా రెండునెలల నుంచి ప్రారంభించారు.ఇప్పటికే ఐరన్‌ పిల్లర్స్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి. రెండువైపులా పునాదులు నిర్మించారు.కిలోమీటరు పొడవునా ఉన ్న ప్లాట్‌ఫారాలపై రూఫింగ్‌లు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో షాపింగ్‌మాల్స్‌ కూడా ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది.

Updated Date - Dec 16 , 2025 | 12:05 AM