Share News

కార్గో ఎయిర్‌పోర్టుతో పలాస అభివృద్ధి

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:12 AM

మందస- వజ్రపుకొత్తూరు మండలాల మధ్యలో ఏర్పాటు కానున్న కార్గో ఎయిర్‌పోర్టుతో ప లాస చరిత్ర మారుతుం దని, అన్నివర్గాలవారు సహకరించాలని వ్యవ సాయశాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు.

కార్గో ఎయిర్‌పోర్టుతో పలాస అభివృద్ధి
మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

పలాస, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మందస- వజ్రపుకొత్తూరు మండలాల మధ్యలో ఏర్పాటు కానున్న కార్గో ఎయిర్‌పోర్టుతో ప లాస చరిత్ర మారుతుం దని, అన్నివర్గాలవారు సహకరించాలని వ్యవ సాయశాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. మంగళవారం రాత్రి స్థానిక పద్మనాభపురం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం వద్ద పలాస ఏఎంసీ చైర్మన్‌గా ఎంపికైన మల్లా శ్రీనివాసరావు, డైరెక్టర్లతో నిర్వహించిన ప్ర మాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్య వసాయ మార్కెట్‌ కమిటీలు వైసీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యం అయిపో యాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏఎంసీల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందన్నారు. మార్చి నెలాఖరునాటికి కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్‌ పనులు పూర్తి చేసి చంద్రబాబుతో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రూ.5కే అన్న క్యాంటీన్లలో అన్నం పెడుతుంటే వైసీపీ నేతకు రాజకీయాలు చే స్తున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ల పంపిణీకీ శ్రీకారం చుట్టనున్నామన్నారు. మూలపేట పోర్టు పనులు 80 శాతం పూర్త య్యాయని, ఈ ఏడాదిలో షిప్‌లు వచ్చేలా పనులు చేస్తున్నామన్నారు. ఎమ్మె ల్యే గౌతు శిరీష మాట్లాడుతూ పలాసలో జరుగుతున ్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక సోషల్‌మీడియాలో వికృతచేష్టలకు పాల్ప డుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పీసీఎంఏ ప్రధాన కార్యదర్శి టంకా ల రవిశంకర్‌ గుప్తా, నాయకులు చౌదరి బాబ్జీ, వజ్జ బాబూరావు, లొడగల కా మేశ్వరరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, మల్లా కృష్ణారావు, సూరాడ మోహనరావు, వంకల కూర్మారావు, దడియాల నర్సింహులు, బోయిన గోవిందరాజులు, పారిశ్రామికవాడ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:12 AM